- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకులాల్లో ఏం జరుగుతోంది ? తల్లిదండ్రులకు కూడా అనుమతి లేదా ?
దిశ, హుజురాబాద్ రూరల్: ఓమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో కూడా ఆనవాళ్ళు బయటపడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకుల పాఠశాలలో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. హుజురాబాద్‌లోని వీణవంకకు చెందిన జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
విద్యార్థుల తల్లిదండ్రులను సైతం స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న నరసింహారెడ్డి లోపలికి అనుమతించడం లేదు. కనీసం లోపల వసతులు ఎలా ఉన్నాయో చెప్పాలని అడిగినప్పటికీ దాటవేసే సమాధానాలు చెప్పుకొచ్చారు. లోపలికి వెళ్లాలంటే ఎవరిని అడగాలి అంటే తమ పై ఆఫీసర్ ఉన్నాడు అని చెప్పడంతో ఆఫీసర్ నంబరు చెప్పాల్సిందిగా అడిగినప్పటికీ తనకు తెలియదంటూ ఫోన్ కట్ చేశాడు. కనీసం మెనూ లిస్ట్ ఇవ్వాలన్న ఇవ్వ లేదు. దీంతో కరోనా సమయం అయినప్పటికీ కనీస వసతులు కూడా ఉన్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. సౌకర్యాలన్నీ సరిగా ఉంటే తల్లిదండ్రులను లోపలికి ఎందుకు అనుమతించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తక్షణమే ఉన్నతాధికారులు వచ్చి గురుకుల పాఠశాలలో సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయో, లేవో తెలుసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.