- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెనుభారం మోపిన ఆన్‌లైన్ క్లాసులు
ఆన్‌లైన్ క్లాసులు విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం మోపాయి. అసలే కరోనా కారణంగా ఆర్థికంగా చితికిన బతుకులకు విద్యార్థుల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫీజులు చెల్లించకుంటే విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్‌లైన్ లింక్‌ను కట్చేస్తున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ల్యాప్‌టాప్, ట్యాబ్ లేదా మొబైల్ కొనుగోలు చేయాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించడం పేద, మధ్యతరగతి ప్రజలకు మోయని భారంగా మారింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆన్ లైన్ చదువుల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులపై ఈ ఏడాది అదనంగా రూ.5500 కోట్ల భారం పడినట్లు నిపుణులు చెబుతున్నారు.
దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉప్పల్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి తన కుమారుడిని ఓ కార్పొరేట్ స్కూల్ లో చదివిస్తున్నాడు. ఆ స్కూల్ లో ఏడాదికి రెగ్యులర్ ఫీజు రూ.45వేలు. కరోనా కారణంగా తాను పనిచేస్తున్న చోట సగం జీతమే ఇస్తున్నారు. దీంతో స్కూల్ ఫీజులు సకాలంలో చెల్లించలేకపోతున్నాడు. దీంతో స్కూల్ యాజమాన్యం ఆన్‌లైన్ లింక్ కట్ చేసింది. ఇదేమిటని సదరు పేరెట్ ప్రశ్నిస్తే స్కూల్ ఫీజులు చెల్లిస్తేనే లింక్ ఓపెన్ చేస్తామని యాజమాన్యం తెగేసి చెబుతోంది. చేసేదేమీ లేక తన కుమారుడి భవిష్యత్‌కోసం తెలిసిన వారి వద్ద అప్పు చేసి స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చింది. అసలే కరోనా కష్టాల్లో ఉన్న పేద, మధ్య తరగతి తల్లిదండ్రులకు కొత్త చిక్కు వచ్చిపడింది. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో వారిపై పెనుభారం పడుతోంది. వీటి కోసం సెల్ ఫోన్‌లు, ట్యాబ్‌లు, నోట్ బుక్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనాల్సి వచ్చింది. దీనికి తోడు రెగ్యులర్ క్లాసులు నడిచిన మాదిరిగానే ఫీజులు చెల్లించాలని విద్యాసంస్థల యాజమాన్యలు ఒత్తిడి తెస్తున్నా యి. దీంతో కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. కరోనా కష్టకాలంలో తలకు మించిన భారంగా మారుతోంది.
లింక్ కట్..
2019-20 విద్యా సంవత్సరం ముగియక ముందే లాక్‌డౌన్ విధించడం, కొత్త విద్యాసంవత్సరం కోసం అడ్మిషన్లు లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతులకు శ్రీకారం చుట్టాయి. దీంతో విద్యార్థులు చేజారిపోకుండా ఉండడంతోపాటు బకాయిలు రాబట్టుకోవచ్చనే ఆలోచన చేశాయి. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ పేరిట ముందస్తు వసూళ్లు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ వివిధ స్కూ ళ్లు ఫీజుల కోసమే అన్నట్లుగానే ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. జూమ్ యాప్, పేరెంట్ యాప్ ఐడీతోపాటుగా ప్రత్యేక లింక్‌ను విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌కు పంపుతున్నాయి. తరగతుల నిర్వహణ కోసం ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లించని వారికి ఆన్‌లైన్ తరగతులు లేవంటూ లింక్ కట్ చేస్తున్నాయి. ఒకవైపు కొత్త స్ట్రెయిన్ కరోనా ఎప్పుడు కాటేస్తుందోనని భయం.. మరోవైపు చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని ఆందోళన. ఇక వ్యాపారుల పరిస్థితి మరీ దారుణం. ఇంకా వ్యాపారం పుంజుకోకపోవడంతో షాపుల అద్దెలు, ఎంప్లాయీస్ జీతాలు చెల్లించలేక ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఈ కష్టకాలంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారం తల్లిదండ్రులకు నిద్ర పట్టకుండా చేస్తోంది.
అప్పుల పాలు..
పిల్లల చదువుల కోసం ఎంతైనా ఖర్చు చేసే తల్లిదండ్రులను విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి రంగారె డ్డి జిల్లాలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు దాదాపు 45 వేలు ఉండగా, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు 50 వేల పైమాటే. వీరితోపాటు ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థు లు సుమారు 10 లక్షల వరకు ఉండొచ్చని విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నా రు. వీరందరికీ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నాయి.
ఆన్ లైన్ చదువుల ద్వారా విద్యా ర్థుల తల్లిదండ్రులపై ఈ ఏడాది అదనంగా రూ.5500 కోట్ల భారం పడిందని నిపుణు లు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ ఆన్ లైన్ చదువుల కోసం ల్యాప్ టాప్ కొనుగోలు చేసినట్లు కంప్యూ టర్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లల కోసం రూ.20 నుంచి రూ.35వేల దాకా చెల్లించి, ల్యాప్ టాప్, ట్యాబ్ లేదా మొబైల్ ఫోన్లను కొన్నారని తెలిపారు.
ఒత్తిడి సరికాదు..
ఆన్‌లైన్ క్లాసులకు రెగ్యులర్ ఫీజులు చెల్లించాలని పలు విద్యాసంస్థలు తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడం సరికాదు. ప్రైవేట్ ఉద్యో గుల పరిస్థితి దారుణంగా ఉంది. యాజమాన్యాలు ఉదాసీనతతో వ్యవహరించాలి.
– రమణయాదవ్, పాత బోయిన్ పల్లి
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..
ఆన్ లైన్ క్లాసుల తో తల్లిదండ్రుల పై తీవ్ర భారం పడింది. ఆన్ క్లా సుల కోసం కొద్ది మంది టీచర్లనే కొనసాగిస్తున్నారు. దీనికితోడు స్కూల్నిర్వహణ ఖర్చు కూడా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ ఫీజులు ఎలా వసూలు చేస్తారు. దీనిపై ప్రభుత్వం చొరవ తీసుకుని, తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్న విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి
–ఏనుగుల తిరుపతి, బీజేపీ నేత