- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నుంచి అమ్మాయిల్ని ముట్టుకుంటే… షాకే
దిశ, వెబ్ డెస్క్ : రోజు రోజుకి అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. బయటికి వెళ్లిన అమ్మాయి ఇంటికి వచ్చేదాక నమ్మకంలేని రోజులివి. ఏదైనా పనిమీద వెళ్లినా లేదా కాలేజ్ కి వెళ్లినా అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చేదాక తల్లిదండ్రులు కళ్లలో ఒత్తులేసుకుని చూస్తుంటారు. అమ్మాయిలు సైతం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటీకే చాలామంది అమ్మాయిలు తమను తాము కాపాడుకోవడానికి పెప్పర్ స్ప్రే లాంటివి ఉపయోగిస్తుంటారు.
అమ్మాయిల సేఫ్టీ కోసం ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ యాప్స్ వలన అమ్మాయిలు ఏ లొకేషన్ లో ఉన్నారు? అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ అమ్మాయిలను, అబ్బాయిలు వేధిస్తుంటే వారు చెప్పేవరకు ఎవరికి తెలియదు. అయితే అబ్బాయిలు, అమ్మాయిలను పట్టుకోగానే కరెంట్ షాక్ కొడితే.. ఈ ఆలోచనే ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు వచ్చింది. వెంటనే ఆ ఆలోచనతో అమ్మాయిల రక్షణ కోసం ఉమెన్ సేప్టీ పరికరాన్ని రూపొందించారు. దీని సహాయంతో అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులలో ఉన్న తమను ఈ పరికరం కాపాడుతుంది.
విజిటింగ్ కార్డు సైజ్ ఉండే ఈ పరికరాన్ని మహిళలు దుస్తుల్లో లేదా పాకెట్‌లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే వారికి కరెంట్ షాక్ తగిలి, దాదాపు 5 నిమిషాల పాటు ఏమీ చేయలేకుండా ఉండిపోతారు. ఆ సమయంలో మహిళలు ఆపద నుంచి బయటపడొచ్చని, ఈ పరికరం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాజెక్టు గైడ్ వి.శేషగిరిరావు తెలిపారు. ఈ పరికరానికి అరగంట చార్జింగ్ పెడితే ఆరుగంటలు పనిచేస్తుందంటా. ఈ పరికరం తయారీకి విజిటింగ్ కార్డు సైజ్ బోర్డు, రెండు స్టీల్ పేట్లు, 4 ఓల్ట్ బ్యాటరీ, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌ఫార్మర్, స్పార్క్ గ్యాప్ కెపాసిటర్, పుష్ ఆన్ స్విచ్ వాడి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు చెందిన అమ్మాయిలు తయారు చేశారు.