- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాగైతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యం.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మూర్తి
దిశ, జనగామ: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ముట్టడి కార్యక్రమంలో విద్యార్థులు భారీగా పాల్గొని కదం తొక్కారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, జిల్లా కార్యదర్శి నరేందర్‌లు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు. దాదాపు 33 వందల కోట్ల స్కాలర్ షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. సంవత్సరానికి దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు తమ చదువులను స్కాలర్‌షిప్ మీద ఆధారపడి కొనసాగిస్తున్నారని, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకపోతే వారు చదువులను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం కోసం వందల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు ఎందుకు కనీసం రూ.100 కోట్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యారంగాన్ని కాపాడలేని టీఆర్ఎస్ ప్రభుత్వం, బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్లో చదివే విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ ఛార్జీలు కూడా పెంచాలని, హాస్టల్ లో విద్యార్థులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కలెక్టరేట్ ఏవో మురళీధర్‌కి వినతి పత్రం అందజేసి ధర్నా విరమించారు. ఈ నిరసనలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధర్మభిక్షం, ఉపాధ్యక్షులు సందీప్, నాయకులు తరుణ్, శ్రావణ్, సందీప్, అజయ్, కేశవరాజు, రమేష్, మహేష్, శివ పాల్గొన్నారు.