తెరుచుకున్న బడులు.. వెంటే వచ్చిన కరోనా!

by Anukaran |   ( Updated:2020-11-02 10:47:23.0  )
తెరుచుకున్న బడులు.. వెంటే వచ్చిన కరోనా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి కారణంగా మూతబడిన పాఠశాలలు ఎట్టకేలకు సోమవారం తెరుచుకున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఏపీ విద్యాశాఖ అనుమతించింది. దీంతో విజయవాడలో తొలిరోజు 98.84 శాతం ఉన్నత పాఠశాలలు ఓపెన్ అవ్వగా, 87.77 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. తరగతులకు మాత్రం కేవలం 39.62 శాతం తొమ్మిదో తరగతి, 43.65 శాతం మంది పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు.

అయితే, బడిగంట మోగిన తొలిరోజే పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. నెల్లూరు జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా మర్రిపాడు మండలం నందవరం మోడల్ హైస్కూల్ వాచ్‌మన్ కూడా కరోనా బారిన పడ్డాడు. నెల్లూరులోని మండల పాఠశాలలో చదివే ఇద్దరు హైస్కూల్ విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో పిల్లల తల్లిదండ్రులతో పాటు అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story