- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది’
దిశ, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే విద్యార్థులందరిని పాస్ చేయాలని డిమాండ్ చేసాయి. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కార్యాలయాన్ని టీఎన్ఎస్ఎఫ్, తెలంగాణ జన సమితి, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించాయి.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు గత సంవత్సరం అధ్యాపకులు లేరని, తరగతులు నిర్వహించకుండానే పరీక్షలు నిర్వహించడం వల్ల చాలామంది విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా అధ్యాపకులు లేరని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం వారు పరీక్షల్లో ఫెయిల్ అయితే దానికి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు.
నోటిఫికేషన్లు వేయక నిరుద్యోగులను, తెలంగాణ ఉద్యమం పేరుతో ఉద్యమకారులను,వరి ధాన్యం కొనకుండా రైతులను, పరీక్షల పేరుతో విద్యార్థులను చంపిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు పాస్ చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానీదేనన్నారు. కార్పొరేట్ కళాశాలకు తలొగ్గిన ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చిందని, దానివల్ల ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొడితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, జనసమితి జిల్లా ఇంచార్జి కుంబాల లక్ష్మణ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం విద్యార్థులు జిల్లా అధ్యక్షుడు నాగరాజు, విద్యార్థులు రాజు, నవీన్, సతీష్, సందీప్, అఖిల్, సందీప్, ఆంజనేయులు, నర్సింలు, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.