ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

by Sumithra |

దిశ, వరంగల్: ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట్ గ్రామ శివారు తహారాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన నాగరాజు (17) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. అటువైపు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని బయటకుతీశారు.

Tags: student died, swim, agriculture well, accidental, lockdown

Advertisement

Next Story