- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన బాధితులు.. సూసైడ్ అటెంప్ట్
దిశ, నాగార్జునసాగర్: అనేక సంవత్సరాలుగా డ్యామ్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన కుటుంబాలు స్థానిక పైలాన్ కాలనీలోని నివసిస్తున్నారు. అయితే గిరిజన నిరుపేదల ఇళ్ళను నందికొండ మున్సిపాలిటీ అధికారుల కూల్చివేశారు. తమకు ఎటువంటి నోటీసులు లేకుండా తమ ఇళ్లను అక్రమంగా కూల్చివేశారని బాధితులు జాను నాయక్ వాపోయారు. తమ ఇళ్లను కూల్చిన మున్సిపాలిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. స్థానిక నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ ప్రధాన రహదారిపై గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. బాధితుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చిన మున్సిపాలిటీ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. విజయపురి నార్త్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావుకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాండు నాయక్, శంకర్ నాయక్, ముని నాయక్, క్రిష్ణ నాయక్, నాగేందర్ నాయక్, సంతోష్, నాగరాజు, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.