- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ రంగనాథ్
దిశ, నల్గొండ: లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. జిల్లాలోని కంటైన్‌మెంట్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కరోనా వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తున్నందున జిల్లాస్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతాన్ని కూడా కంటైన్‌మెంట్‌గా ప్రకటించి వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈదులగూడ కాలనీలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మహిళతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించి వారికి ముద్ర వేసి క్వారంటైన్‌కు పంపారు. వారిని బయటకు వెళ్లకుండా చూసుకోవాలని పోలీసులు, వైద్యాధికారులకు ఎస్పీ రంగనాథ్ సూచించారు.
Tags: SP ranganath, Strict, violations, regulations, nalgonda