- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దపల్లి జిల్లాను గంజాయి రహితంగా మార్చాలి : డీసీపీ రవీందర్
దిశ, గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గంజాయి, మత్తు పదార్థాల నిర్ములనపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దపల్లి డీసీపీ రవీందర్ హాజరయ్యారు. రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు, పాన్ షాపు ఓనర్లు, ఆటో డ్రైవర్లు ప్రజా సంఘాల నేతలు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం వేస్తామని అన్నారు. మత్తు పదార్థాలకు యువతను దూరం చేయాలనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి విక్రయిస్తున్న ప్రదేశాలను గుర్తించి గంజాయి సేవించే వ్యక్తులను వారి ద్వారా గంజాయి ఎక్కడ నుండి సప్లై చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించడం జరుగుతుందన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు, డివిజన్ కార్పొరేటర్లు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
మత్తు పదార్థాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను, ప్రజలను రక్షించవలసిన బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వారికి నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని డీసీపీ తెలిపారు. గంజాయి అమ్మినా, తీసుకున్నా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్‌ఐలు సతీష్, ఉమా సాగర్ తదితరులు పాల్గొన్నారు.