- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఎస్సై జయప్రసాద్
దిశ, జడ్చర్ల : వాల్టా చట్టాన్ని అతిక్రమించి అక్రమ ఇసుక రవాణా చేపడితే అక్రమ ఇసుక రవాణా దారులపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామని మిడ్జిల్ ఎస్సై జయప్రసాద్ అన్నారు. ఆదివారం మిడ్జిల్ మండల పరిధిలోని దుందుభి వాగు నుండి వాల్టా చట్టాన్ని అతిక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ట్రాక్టర్ ను పట్టుకొని మిడ్జిల్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన వాహనాలపై యజమానుల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మండలంలో దుందుభి నది నుండి అనుమతులు లేకుండా వాల్టా చట్టాన్ని అతిక్రమించి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మండలంలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అవసరముంటే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా చేపడుతున్నట్లు పక్కా సమాచారం ఉంటే మిడ్జిల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని పరివాహక ప్రాంత రైతులకు సూచించారు. వాహనాలను పట్టుకున్న వారిలో ట్రైనీ ఎస్సై శ్రవణ్, సిబ్బంది ఉన్నారు.