- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్ద మనుషుల చీకటి బాగోతాలు.. బయటపెట్టిన ‘స్ట్రీట్ లైట్’
దిశ, సినిమా : అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, తాన్య దేశాయ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ లీడ్ రోల్స్‌లో విశ్వ దర్శకత్వం వహించిన సినిమా ‘స్ట్రీట్ లైట్’. మూవీ మాక్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రాన్ని సెప్టెంబర్ మూడో వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్న నిర్మాత.. క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితంగా మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు.
పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చెలామణి అయ్యే చాలామందిలో రాత్రి అయితే.. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్స్ ఎలా మారతాయన్న నేపథ్యంలో మూవీ ఉండబోతుందని వెల్లడించారు. ప్రధానంగా చీకట్లో ‘స్ట్రీట్ లైట్’ కింద జరిగే సంఘటనల ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కించినట్లు వివరించారు. ముందుగా సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తామని, ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తామని తెలిపారు. చిత్రం శ్రీను, ధన్‌రాజ్, షకలక శంకర్ తదితరులు నటించిన చిత్రానికి విరించి మ్యూజిక్ అందించారు.