- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యజమాని కోసం ‘బ్లాకీ’ నిరీక్షణ ఫలిస్తుందా!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో అతి విశ్వాసం చూపించే ప్రాణి ఏదైనా ఉంది అంటే కుక్క మాత్రమే. దాని విశ్వాసం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని అంటుంటారు. మనం చూపించే.. కాస్త ఆదరణ కోసం వాటి ప్రాణాన్ని కూడా పణంగా యజమానుల్ని కాపాడుకుంటాయి. అలా యజమానికుటుంబాన్ని కాపాడి ప్రాణాలు కోల్పోయిన శునకాలూ అనేకం ఉన్నాయి. యజమాని కుటుంబమే తన కుటుంబంగా, వారి రక్షణే తన కర్తవ్యంగా భావిస్తుంటుంది. అందుకే కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. ప్రస్తుత మానవ జీవితంలో కుక్క కూడా ఒక భాగం అయిపోయింది. ప్రస్తుతం 60 శాతం ఇళ్లలో శునకాన్ని పెంచుకున్నారు. చాలా మంది తమ ఇళ్లలో కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ కుక్క యజమాని పట్ల అమితమైన విశ్వాసం చూపింది. యజమాని కోసం నిద్రాహారాలు మాని మరీ ఎదురుచూస్తున్న దానిని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. వివరాళ్లోకి వెళితే..
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఇటీవల భారీ వరదలు సంభవించించిన విషయం తెలిసిందే. దీంతో అనేక ఇళ్లు నీటమునిగి తీవ్రనష్టం ఏర్పడింది. కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఎక్కడివాళ్లు అక్కేడే చిక్కుకున్నారు. ఈ సందర్భంగా తపోవన్ – విష్ణుకుండ్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకుపోయిన వారి కోసం ముమ్మరంగా వెదుకులాట కొనసాగుతోంది. అధికారులే కాకుండా.. కొన్ని రోజులుగా కుక్క తన యజమాని కోసం సొరంగం వద్ద ఎదురుచూస్తూ పగటిపూటంతా అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో దానిని పరిక్షించిన అధికారులు, దానికి ఆహారం పెడుతూ సంరక్షిస్తున్నారు. ఈ రకంగా సిబ్బందికి కూడా ఆ శునకం మరింత దగ్గరయింది. రోజూ సొరంగం దగ్గరకు రావడం యజమాని కోసం ఎదురు చూడడం, స్థానిక సిబ్బంది ఇచ్చిన ఆహారాన్ని కొద్దిగా తీసుకోవడం, రాత్రి యజమాని కనిపించక తిరిగి నిరాశగా వెళ్లిపోవడం రోజూ జరుగుతోంది.
దీంతో ఆ కుక్క విశ్వాసాన్ని చూసిన వారంతా ముగ్ధులవుతున్నారు. ఈ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి స్థానిక అధికారుల వద్దకు వచ్చి కుక్కకు సంబంధించిన వివరాలు అధికారులకు తెలిపాడు. ఆ కుక్క పేరు బ్లాకీ అని, దాని వయసు రెండేళ్లని, తమ పక్కంటి వాళ్లింట్లో ఉండేదని, వరదల్లో గల్లంతైన దాని యజమాని కోసం ఎదురు చూస్తోందని అన్నాడు. దీంతో ఆ అధికారులకు దానిపై మరింత అభిమానం పెరిగిపోయింది. బ్లాకీ నిరీక్షణ ఫలించాలని స్థానికులతో పాటు అధికారులూ ఎదురుచూస్తున్నారు.