గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయిన శింబు.. కారణం అదే?

by Shyam |   ( Updated:2021-08-14 05:45:37.0  )
shimbu
X

దిశ, సినిమా : ‘వెందు తనిందదు కాడు’ పేరుతో కొత్త సినిమా ప్రకటించిన తమిళ్ యాక్టర్ శింబు.. ఫస్ట్ లుక్‌తో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో శింబు ఇలాంటి గెటప్‌లో కనిపించకపోగా.. లేటెస్ట్ లుక్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమా కోసం ఏకంగా 15 కిలోలు తగ్గిన శింబు గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యాడు. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను చూసిన వారంతా ఇది ఫొటోషాప్‌‌ మ్యాజికా? లేదంటే నిజంగానే బరువు తగ్గాడా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ పిక్చర్‌తో పాటు అంతకు ముందటి ఫొటోను శింబు ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

ఓల్డ్ ఫొటోలో శింబు ఫ్యాట్ బెల్లీతో కనిపిస్తుండగా.. తాజా పిక్చర్‌లో పూర్తిగా చిక్కిపోయినట్లున్నాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో తనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వారం కిందటే ‘వెందు తనిందదు కాడు’ షూటింగ్ మొదలవగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే, పలువురు నిర్మాతలకు పెండింగ్ బకాయిలు చెల్లించాల్సిన విషయంలో వివాదం కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. దీంతో అవన్నీ చెల్లిస్తేనే షూటింగ్‌కు అనుమతిస్తామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సూచించింది.

Advertisement

Next Story