- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవిత్ర పండుగ ముక్కోటి ఏకాదశి
వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థమైన ఆ రోజు తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే, మిగతా 23 ఏకాదశులకు సైతం ఉపవాసం ఉన్నట్టేనని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధి ఇచ్చి జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుందని అంటారు.
హిందువులకు అందులో ముఖ్యంగా శ్రీవైష్ణవులకు పవిత్రమైన పండుగలలో ముక్కోటి ఏకాదశి ఒకటి. దీనినే 'పుత్రదా ఏకాదశి'అని కూడా అంటారు. ఈ రోజు దేశంలోని అన్ని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనంతో భగవంతుణ్ణి దర్శిస్తే వైకుంఠం లభిస్తుందని భక్తుల విశ్వాసం. యేడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే 'వైకుంఠ ఏకాదశి' లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందు వలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
అన్ని ఏకాదశులు కలిపి
ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని చెబుతారు. పద్మ పురాణం ప్రకారం ముర రాక్షసుడిని ఇదే రోజున సంహరించారని నమ్ముతారు. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణుదేవుడిని శరణు వేడుతారు. ముర రాక్షసుడు వారిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలో హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయనలోంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు.
వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థమైన ఆ రోజు తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే, మిగతా 23 ఏకాదశులకు సైతం ఉపవాసం ఉన్నట్టేనని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధి ఇచ్చి జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుందని అంటారు.
పుత్రద ఏకాదశి కథ
పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయినా, గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్ర కాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని, వారిని సేవించి తనకు పుత్ర భిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు 'పుత్రద ఏకాదశి' గావున నీవు నీ భార్యతో కలిసి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక మీ కోరిక నెరవేరుతుందని చెప్పారు. ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకకు వివరిస్తాడు. దీంతో ఆమె సంతోషించి వారిద్దరు కలిసి భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశి వ్రతాన్ని' చేస్తారు. దీంతో కొద్దికాలంలో కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత చేయిస్తాడు.
శ్రీరంగంలోని రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాలతో అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శంపజేస్తారు. ఈరోజున శ్రీరంగం తో పాటు, తిరుపతి లాంటి వైష్ణవాలయాలలో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆలయ నిర్వహకులు కరోనా మళ్ళి విజృంభిస్తుందనే వార్తలను పరిగణలోకి తీసుకొని నిబంధనలు కఠినతరం చేయాలి. అలాగే కరోనా నెగిటివ్, వాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నవారికి మాత్రమే గుళ్లలోకి అనుమతించాలి. గుళ్ళలో సానిటైజేషన్ చేయించాలి.
(జనవరి 2న ముక్కోటి ఏకాదశి)
ఆళవందార్ వేణుమాధవ్
8686051752
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672