- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పడకేసిన ‘రెండు పడకలు’ !
దిశ, మహబూబ్‌నగర్: ఇళ్లులేని పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు. అందరూ అత్మగౌరవంతో బతికే విధంగా ఇళ్ల నిర్మాణం. ఇవన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన మాటలు. అయితే అప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నీటి మూటలయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి 1,400 చొప్పున ఇళ్ల నిర్మాణాలన్న హామీలు తేలిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 19,600 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో అప్పట్లోనే 3,400 ఇళ్లు మంజూరు చేయగా మిగతా నియోజకవర్గాలకు 1,400 చొప్పున కేటాయించారు. ఇప్పటివరకు దేవరకద్ర, గద్వాల నియోజకవర్గాల్లోనే పదుల సంఖ్యలో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించిన తర్వాత మమ అనిపించారు. అనువైన స్థలాలు దొరక్క, ఉన్న స్థలాలు పట్టణాలకు దూరంగా ఉండడం, ఇసుక కొరతతో ముందుకు సాగలేదు. కానీ, కొన్నిచోట్ల ఇంటి నిర్మాణాలు ప్రారంభించినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారు. దీంతో కొన్నిచోట్ల డబుల్ బెడ్రూం ఇళ్లు అసాంఘిక శక్తులకు నిలయంగా మారాయి.
మహబూబ్‌నగర్‌లో మూడు ప్రాంతాల్లో ప్రభుత్వం 3,400 ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. దివిటిపల్లి దగ్గర సర్వే నెం.423లో 1,024 ఇళ్లను రూ.61.65 కోట్ల వ్యయంతో నిర్మించాలని గౌరిశంకర్ ఇన్‌ఫ్రా బిల్డర్స్‌కు పనులు అప్పగించింది. అనుకున్న సమయానికి ఇళ్లను పూర్తి చేసిన కంపెనీ బిల్లు రాలేదనే సాకుతో ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ హడావుడిగా ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమం పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటివరకు లబ్ధిదారులకు అప్పగించలేదు. అటు క్రిష్టియన్‌కాలనీలో చేపట్టిన 310 ఇళ్ళలో కొన్నింటినే లబ్ధిదారులకు కేటాయించారు. ఎర్రమనుగుట్ట శివారులో చేపట్టిన 570 ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇళ్ల మధ్యలో వేయాల్సిన రోడ్లను కాంట్రాక్టర్ గాలికి వదిలేయడంతో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో కొన్ని ఇళ్ళకు బిగించిన మీటర్లు, స్వీచ్ బోర్డులు ఇప్పుటికే ఊడిపోయి వేలాడుతున్నాయి. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సంగతి సరేసరి. ఇప్పటికే కొన్ని ఇళ్ల కిటికీ అద్దాలు ఆకతాయిలు ధ్వంసం చేయగా, ఇళ్ల పునాదుల వద్ద సరిగా ప్లాస్టరింగ్ చేయకపోవడంతో నాణ్యతాప్రమాణాలకు అద్దం పడుతోంది.
అసాంఘికశక్తులకు నిలయంగా..
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో అసాంఘికశక్తులకు నిలయంగా మారాయి. జిల్లాలోని దివిటిపల్లి వద్ద ఉన్న ఇళ్లు జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ప్రస్తుతం మందుబాబులు సిట్టింగ్ వేస్తున్నారు. రాత్రివేళలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. రాత్రి టైంలో చీకటి ఉండి లైట్లు లేకపోవడంతో వచ్చి వెళ్లే వారికి అనువుగా మారింది. ముఖ్యంగా నిర్మాణాలు చేపట్టిన తర్వాత మంచి, చెడ్డలు చూసేందుకు అటు ప్రభుత్వం, ఇటు కాంట్రాక్టర్లు సెక్యూరిటీని నియమించకపోవడంతో అ సాంఘిక శక్తులకు అడ్డాగా మారింది.
Tags : Mahabubnagar, Diwitipally Double bedroom house, gadwala, non-performing activities, National Highway, Drugs, Telangana