- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TikTokకు పోటీగా కొత్త అప్లికేషన్
జి ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన ZEE5 వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ఇప్పటికే ఇండియాలో బాగా పాపులర్ అయిన TikTokకి గట్టి పోటీ ఇవ్వబోతోంది. రెండేళ్లలో వందకుపైగా ఒరిజినల్ షోస్ రూపొందించిన ఈ సంస్థ ఈ ఏడాది చివరి నాటికి Hypershots అనే అప్లికేషన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. కేవలం టిక్‌టాక్ మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సర్వీసులకు పోటీ ఇచ్చేవిధంగా దీన్ని రూపొందించబోతున్నారు.
90 నిమిషాల వీడియోలు..
సెలబ్రిటీస్ మొదలుకొని మామూలు వ్యక్తుల వరకు తయారుచేసే 90 నిమిషాలు నిడివి కలిగిన కంటెంట్‌ని ఈ సర్వీస్ సపోర్ట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ విభాగంలో అగ్రస్థానంలో నిలవడానికి తాము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, అందులో భాగంగానే కొత్త అవకాశాలు వైపు దృష్టి సారిస్తున్నట్లు Zee5 ఇండియా సీఈవో తరుణ్ చెప్పారు. యూజర్లు తయారుచేసే కంటెంట్‌కి యూట్యూబ్ తరహాలో వ్యాపార ప్రకటనలు చూపిస్తూ అవసరమైతే సబ్స్క్రిప్షన్ ఆధారంగా కంటెంట్ చూసే అవకాశాన్ని ఈ Hypershots విషయంలో ఆలోచిస్తున్నారు.
జీ5 న్యూ వెర్షన్..
మరోవైపు సంవత్సరానికి కనీసం 15 నుంచి 20 సినిమాలను ZEE5 స్వయంగా నిర్మించే యోచనలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూస్ చానల్స్‌కి సంబంధించిన లైవ్ న్యూస్ ఫీడ్ కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లభిస్తోంది. ఇప్పటికే 14 భాషల్లో కంటెంట్‌ని Zee5 వినియోగదారులకు అందిస్తోంది. అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అభిరుచులు కలిగిన వినియోగదారులకు Zee5 అప్లికేషన్ వేదికగా నిలిచే విధంగా దాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ అప్లికేషన్ Android మరియు iOS వినియోగదారులకు లేటెస్ట్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అలాగే ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ కూడా రూపొందించారు.
ఒరిజినల్ షోస్..
కంటెంట్ విషయానికొస్తే ఈ ఏడాది 80 నుంచి 100 ఒరిజినల్ షోస్ రూపొందించే యోచనలో ఆ సంస్థ ఉంది. ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ సర్వీసులకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రంగంపై Zee5 దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
tags: hypershots, tiktok, android, zee5