- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని ఆపండి
దిశ, న్యూస్ బ్యూరో: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వైద్యులపై పని భారం పెరిగి, వైద్య సిబ్బంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ రాష్ట్ర డాక్టర్స్ ఫోరమ్ కన్వీనర్ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకట్ట వేయలని డిమాండ్ చేశారు. కరోనా పేరిట రూ.లక్షల వ్యాపారం చేస్తూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాబడి పొందిన ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉచితంగా కరోనాకి సేవలందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
కుటుంబాలను వదిలి, ప్రాణాలు తెగించి డ్యూటీలకు హాజరయ్యే వైద్య సిబ్బందికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. గతంలో మంత్రి ఈటల రాజేందర్ ను కోరిన విధంగా కరోనా వైరస్ వ్యాధిపై పోరాటం చేస్తూ అమరులైన వారికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రాజ్ కుమార్ జాదవ్ డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఐఓగా, డిప్యూటీ డీఎంహెచ్ఓగా విధులు నిర్వర్తిస్తూ మృతిచెందిన డాక్టర్ నరేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.