- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంలో ఆ మాటలు.. వ్యక్తిగతంగా తీసుకోవద్దు!
దిశ, ఫీచర్స్ : జీవితం అనుభవాల సారమే కాదు అనుబంధాల కలయిక కూడా. రోజువారీ జీవితంలో ఎంతోమంది వ్యక్తులతో మాట్లాడతాం, పరిచయాలు పెంచుకుంటాం. అయితే కలిసిన ప్రతి వ్యక్తితో ఒకే విధమైన బాండింగ్ ఏర్పడదు. కొందరు స్నేహితులుగా తోడు నిలిస్తే.. ఇంకొందరు ఆత్మీయులై జీవితంలోకి ప్రవేశిస్తారు. మరికొందరు మాత్రం పరిచయస్తులుగా ఉండిపోతారు. ఇక జిందగీతో ముడిపడిన ‘బంధుత్వాలు’ ఉండనే ఉంటాయి. ఏదేమైనా మనం ఒకరి పట్ల హుందాగా ప్రవర్తించినప్పుడు, సహజంగా అవతలి వ్యక్తి నుంచి కూడా అదే కోరుకుంటాం.
కానీ సదరు వ్యక్తులు మిమ్మల్ని అగౌరవపరిచినప్పుడు లేదా మీతో సరిగా నడుచుకోనప్పుడు.. వ్యక్తిగతంగా తీసుకోవడం, మిమ్మల్ని మీరు నిందించుకోవడం కరెక్ట్ కాదనేది మానసిక విశ్లేషకులు చెబుతున్నమాట. దీని వల్ల మానసికంగా కుంగిపోయి, మనశ్శాంతి కరువయ్యే ప్రమాదముంది. సెల్ఫ్-రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్‌పైనా ప్రభావం చూపడంతో పాటు ఇది ఏ విధమైన స్వీయ-అభివృద్ధికి తోడ్పడదు. వ్యక్తిగతంగా తీసుకోనప్పుడే భావోద్వేగాల నియంత్రణపై దృష్టి సారించే స్వేచ్ఛ మీకు లభిస్తుంది.
సంఘ జీవులుగా సంబంధ బాంధవ్యాలు అవసరమే. అయితే అత్యంత సన్నిహిత సంబంధాల నుంచి వీధిలో అపరిచితుల వరకు ఆయా వ్యక్తులతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని బట్టి లేదా పరిస్థితులకు అనుగుణంగా అసలైన రంగులు బయటకు రావచ్చు. కొందరితో కనెక్ట్ కావడమే కష్టంగా అనిపించొచ్చు. అంతేకాదు వ్యక్తి కంటే డబ్బు, హోదా, అధికారం వంటి అంశాలకే అధిక ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులూ ఎదురవుతారు. అది సద్విమర్శనా లేదా కావాలనే కించపరిచేందుకు ఆ పదాల్ని వాడుతున్నారా? మనతో ఆ వ్యక్తికి అవసరం తీరిపోయిందా? లేదా ఆర్థికంగా నష్టపోయినందుకా? మీకు నిజంగా ఈ వ్యక్తి ఆమోదం అవసరమా? ఇలా అన్ని కోణాల్లో విశ్లేషించుకోవాలి.
అతడి ఉద్దేశం సరైనదే అయితే జీవితంలో మన ఉన్నతిని కోరుకునే శ్రేయోభిలాషిగా మిగిలిపోతాడు. లేదంటే అలాంటి వ్యక్తులు, ఆ పరిస్థితులతో కలత చెందడం వృధా. ఎండ్ ఆఫ్ ది డే.. ఎవరో మీ గురించి ఏదో అనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు. నిజంగా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్నదే విషయం. మీ విలువేంటి, మీ సామర్థ్యమేంటో మీకు తెలిసినప్పుడు, మీకు మీరు నచ్చినప్పుడు ఇతరుల మాటలు పట్టించుకోరు. ఆత్మవిశ్వాసంతో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది.
ఒక్క ఛాన్స్..
ఒక వ్యక్తి మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేయడం లేదా మీ గురించి చెడుగా భావించడం లేదా వ్యక్తిగతంగా మీ పై దాడి చేయడం, విలువ తగ్గించడం వంటి పరిస్థితులను పదే పదే సృష్టించాలని పట్టుబట్టినట్లయితే.. ఆ వ్యక్తితో ఉన్న మీకున్న సంబంధాన్ని పునరాలోచించుకోవాల్సిందే. ఒకవేళ అతడు మీకు ఇష్టమైన వ్యక్తి అయితే.. అతడు చెప్పే/చేసే పనుల వల్ల మీరు ఎలా ఇబ్బందిపడుతున్నారో చెప్పే ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఎంత దూకుడుగా, మొరటుగా, అవమానకరంగా వ్యవహరించారో చెప్పాలి. అయినా ఆ వ్యక్తి వినకపోతే.. మీ సొంత ప్రయోజనాల కోసం అన్ని సంబంధాలను తెంచుకోవడమే ఉత్తమం.
లెట్ థింగ్స్ గో..
బాధాకరమైన అనుభవాలను పాఠాలుగా మలచుకోవాలి. ఎలా బలంగా ఉండాలి, చెడు పరిస్థితులను మెరుగ్గా ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకోవాలి. ఆ పరిస్థితులపై లేదా వ్యక్తులపై కోపాన్ని పెంచుకోకుండా, ఆయుధంగా మార్చుకోవడం తెలుసుకోవాలి. ఆ విమర్శలనే మనల్ని మనం మెరుగుపరుచుకునేందుకు, ముందుకు సాగేందుకు ఉపయోగించాలి. అయితే నొప్పిని పట్టుకోవడం అవతలి వ్యక్తి కంటే మీకే ఎక్కువ నష్టం చేస్తుందని గ్రహించి, అలాంటి విషయాలను ఎక్కడికక్కడ విడనాడడం నేర్చుకోవాలి. హ్యాపినెస్ కోసం మరింత సమయాన్ని కేటాయించుకోవాలి.
ఫిల్ యువర్ క్యాలెండర్..
‘ఖాళీ మెదడు దెయ్యాల కొంప’ అని ఊరికే అనలేదు. బిజీగా ఉంటే, ఇతర వ్యక్తుల గురించే కాదు వాళ్లు ఏమనుకుంటున్నారో ఆలోచించడానికి కూడా సమయం దొరకడం కష్టం. అందుకే కుటుంబం, స్నేహితులతో పాటు ఆనందాన్నిచ్చే పనితో జీవితాన్ని నింపేయాలి. దానికి అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి.
డోంట్ క్లైంబ్ డౌన్!
ఎవరైనా మిమ్మల్ని అగౌరవపరిచినప్పుడు లేదా మీ పట్ల క్రూరంగా ప్రవర్తించినప్పుడు.. దానికి అంతే వ్యతిరేకంగా, విషాన్ని చిమ్మే విధంగా ప్రతిస్పందించడం కరెక్ట్ కాదు. ఇతర వ్యక్తులు మిమ్మల్ని కలవరపెట్టేందుకు మీరు అనుమతిస్తున్నారంటే వారికి మీపై అధికారాన్ని ఇస్తున్నారనే అర్థం. మీ శక్తిని ఇవ్వడం ఆపండి. గ్రేట్ మైండ్స్.. ఆలోచనల గురించి చర్చిస్తే, యావరేజ్ మైండ్స్.. సంఘటనలను చర్చిస్తాయి. స్మాల్ మైండ్స్ మాత్రం మనుషుల గురించి మాట్లాడతాయని గుర్తుపెట్టుకోండి.
టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ :
వాస్తవానికి మీ జీవితంలో సంబంధాలు ఎల్లప్పుడూ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కానీ మీ గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, ఇతరులు మీకు చెప్పాల్సిన అవసరం అంత తక్కువ ఉంటుంది. సొంత ఆలోచనలపై ఆధారపడితే, ఇతరులపై ఆధారపడటం తగ్గిపోతుంది. ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవడమే జీవితానికి శ్రేయస్కరం. ఎంత త్వరగా ఇతర వ్యక్తుల గురించి పట్టించుకోవడం మానేస్తారో, జీవితాన్ని స్వీకరించడంలో స్వేచ్ఛను అనుభవిస్తారో అప్పుడు లైఫ్ హ్యాపీనెస్‌తో నిండిపోతుంది.
‘ఏదైనా పరిస్థితి చాలా వ్యక్తిగతంగా అనిపించినా, ఇతరులు మిమ్మల్ని నేరుగా అవమానించినా, మీకు దానితో సంబంధం లేదు. వారు చెప్పేది, చేసేది కాక అభిప్రాయాలు కూడా వారి సొంత మనసులోని ఒప్పందాల ప్రకారం ఉంటాయి. ఒక చిన్న అభిప్రాయంతో మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసి, వారు కోరుకున్న విషాన్ని మీకు తినిపిస్తారు. మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారు కాబట్టి ఆలోచించకుండా తినేస్తారు’. దీనివల్ల ఎవరికి నష్టమో మీరే ఆలోచించుకోండి. మీ గురించి గాసిప్ ప్రపంచమంతా వినిపించొచ్చు. కానీ మనసులోకి తీసుకోనంత వరకు అది మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు భావోద్వేగ విషాన్ని తీసుకోనప్పుడు, అది నింపాలనుకున్న వారిని మరింత అధ్వాన్నంగా మారుస్తుంది.