ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపండి.. రైల్వే జీఎంకు ఎంపీ రంజిత్ రెడ్డి వినతి

by Shyam |
ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపండి.. రైల్వే జీఎంకు ఎంపీ రంజిత్ రెడ్డి వినతి
X

దిశ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్, తాండూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని కోరుతూ చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానంద్ మాల్యాకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులతో కలిసి బుధవారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో జనరల్ మేనేజర్ ను కలిసి సమస్యలు వివరించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ తాండూర్ చేవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రైల్వే శాఖ పరిధిలోని పెండింగ్ ఉన్న సమస్యలను రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అందులో భాగంగా వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రామయ్య గూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, మోమిన్‌పేట్ మండలంలోని గేటు వనం పల్లి, మొరంగపల్లి(సదాశివపేట రోడ్) లలో ఆర్ యు బి రోడ్లు,ప్రస్తుతం వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రైల్వే బ్రిడ్జి ని మరింత బలోపేతం చేయడంతో పాటు మరో ఫుట్ పాత్ ఓవర్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు.

తాండూర్ లోని పాత తాండూరు, కొత్త తాండూరు మధ్య ఆర్ ఓబి రోడ్డు, తాండూర్ రైల్వే స్టేషన్లో లిఫ్టుల ఏర్పాటు, నారాయణపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద బిటి రోడ్డు, తాండూర్ రైల్వే స్టేషన్ ను ఆదర్శ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దాలని, దీంతోపాటు ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో కోణార్క్ఎక్స్‌ప్రెస్, పద్మావతి ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొని స్వయంగా జనరల్ మేనేజర్ కు సూచించినట్లు తెలిపారు. జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story