దేశీయ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు

by Harish |
దేశీయ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు
X

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే బీఎస్‌ఈ సెన్సెక్స్ 600లకు పైగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టి 170కు పైగా పాయింట్లు లాభపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి నివారణ కోసం ఆయా దేశాలు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి భారత్ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఈ చర్యలు దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టడానికి దోహదం చేశాయి. ఉదయమే బీఎస్‌ఈ, నిఫ్టీలు రెండూ 3.5 శాతానికిపైగా లాభపడగా, మధ్యాహ్నం 1.30 గంటల వరకు 6 శాతం లాభ పడ్డాయి. సెన్సెక్స్ 1630 పాయింట్లు పెరిగి, 28,307 వద్ద కొనసాగుతోంది. నిఫ్టి షేర్లు 433 పాయింట్లు లాభపడి 8,235 వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లు లాభల బాట పట్టినా యెస్ బ్యాంకు షేర్ విలువ 18.26 శాతం పతనమైంది. యెస్ బ్యాంక్ షేరు విలువ రూ. 35.05 నుంచి రూ. 28.65లకు పడిపోయింది.

Tags: stocks, share market, live, sensex, nifty, dalal, news, sterlite tech

Advertisement

Next Story

Most Viewed