- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ కి స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగ.. హీరో మంచు విష్ణు అడ్డగింత
దిశ, వెబ్ డెస్క్: స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగ టాలీవుడ్ కి తాకింది. విశాఖలో పర్యటిస్తున్న మోసగాళ్లు మూవీ టీమ్ ను ఉక్కు ఉద్యమకారులు అడ్డుకున్నారు. హీరో మంచు విష్ణు, నవదీప్ లను విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా సినిమా పెద్దలు నోరు మెదపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా షూటింగులు, సినిమా ఫంక్షన్ల కోసం ఏపీకి ఎవరొచ్చినా అడ్డుకుంటామని ఉక్కు ఉద్యమకారులు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రైవేట్ సంస్థలకు సాధ్యం అయ్యేది ప్రభుత్వ సంస్థలకు ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. నష్టాల్లో ఉందని సంస్థను అమ్మాలనుకోవడం సరికాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పందించాలని సినిమా పెద్దలకు ఉందని అయితే రాజకీయ కారణాల వల్ల స్పందించలేకపోతున్నట్లు తెలిపారు. సినీపెద్దలతో చర్చించి వారి సూచనల ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. ఇకపోతే భారీ ఐటీ కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మోసగాళ్లు. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది.
ఈ చిత్రంలో మంచు విష్ణు హీరో కాగా, ఆయన సోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా మంచు విష్ణు, నటుడు నవదీప్ సింహాచలం నరసింహస్వామిని దర్శించుకున్నారు. మోసగాళ్లు చిత్రం విజయవంతం కావాలంటూ సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు.