‘ఉత్పత్తి, డిమాండ్ కూడా క్షీణించే అవకాశం’

by Anukaran |
‘ఉత్పత్తి, డిమాండ్ కూడా క్షీణించే అవకాశం’
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల (international economies)పై కరోనా వైరస్ ప్రభావం ఊహించని స్థాయిలో ఉంది. ప్రపంచ వృద్ధి (Global growth) మైనస్ 3 శాతానికి మించి దిగజారిపోయే ప్రమాదముందని, ఇదే గనక జరిగితే 1930 నాటి స్థాయికి వృద్ధి క్షీణించడం మొదటి తొలిసారి అవుతుందని టాటా స్టీల్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ (Tata Steel Chairman N. Chandrasekaran) అన్నారు.

2020-21లో స్టీల్ డిమాండ్ గణనీయంగా తగ్గుతుందని కంపెనీ వార్షిక నివేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ కూడా ఇలాంటి ఒక సంక్షోభంలోకి దిగజారడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలన్నీ (international economies)నెమ్మదించడం వల్ల ఉక్కు రంగం (Steel sector)పై గణనీయమైన ప్రభావం ఉంటుందన్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణాలతో ఉక్కును ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు (Crude oil) ఉత్పత్తి వృద్ధి భారీగా క్షీణించే అవకాశమున్నట్టు చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. దేశీయ ఉక్కు రంగం (Domestic steel sector) 2019 ఏడాదిలో 1.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరంలో ఇది 7.7 శాతంగా ఉండేదని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమ కంపెనీకి మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలకు సవాలుగా ఉండనుంది. పెరుగుతున్న వాణిజ్య సంబంధ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితుల మధ్య దాదాపు అన్ని దేశాల ఆర్థిక వృద్ధి మందగమనాన్ని (Economic growth slows) ఎదుర్కొంటున్నాయని టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఎఫ్‌వో కౌశిక్ ఛటర్జీ అన్నారు.

Advertisement

Next Story