నా నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రి: ఎమ్మెల్యే రాజయ్య

by Shyam |
నా నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రి: ఎమ్మెల్యే రాజయ్య
X

దిశ, వరంగల్: తన నియోజకవర్గం స్టేషన్‌ ఘన్‌పూర్‌కు నేనే రాజు.. నేనే మంత్రి అని, నియోజకవర్గంలోకి రావాలంటే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్మన్ ఎవరైనా సరే తన అనుమతి తప్పక తీసుకోవాలని ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో పార్టీ హై కమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. సోమవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని స్టేషన్‌ ఘన్‌పూర్‌లో పార్టీ జెండాను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎవరు రావాలన్నా తన అనుమతి తప్పనిసరి అని హుకూం జారీ చేశారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు అభిమానులు ఉండొచ్చు. కానీ, దానిని అడ్డం పెట్టుకుని గ్రూపు రాజకీయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 3 కోట్ల సీడీఎఫ్ నిధులు, రూ. 2.5 లక్షల వేతనం విరాళంగా ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో కొందరు చెక్కులు ఇచ్చారని, అక్కడ చెక్కులు ఇస్తే సముద్రంలో చెంబుతో నీళ్లు పోసినంత సమానమంటూ తనదైన శైలిలో విమర్శలెక్కుపెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడిన తీరు చూస్తే పరోక్షంగా ఎమ్మెల్సీ కడియం శ్రీ హరిని టార్గెట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

tags: mla thatikonda rajaiah, fires on trs leaders, permission required

Advertisement

Next Story

Most Viewed