- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదక ద్రవ్యాలపై స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ కీలక విజ్ఞప్తి
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ సబ్ డివిజన్ మాదకద్రవ్యాల రహితంగా మారాలని, అందుకు ప్రజలు, వ్యాపారస్తులు, ప్రచార మాధ్యమాలు సహకరించాలని ఏసీపీ రఘు చందర్ పిలుపునిచ్చారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుట్కా, హెరాయిన్, కోక్, గాంజా, తంబాకు మొదలైన మాదకద్రవ్యాలు అమ్మడం, కొనడంపై నిషేధం ఉందని గుర్తుచేశారు. మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని, అందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు.
విద్యార్థుల రోజు వారి కార్యకలాపాలను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని కోరారు. అంతేకాకుండా కళాశాలలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మొదలైన ప్రదేశాల్లో విద్యార్థుల కార్యకలాపాలను సమాజం పసి గట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో వ్యాపార, వాణిజ్య సంస్థల్లో మాదకద్రవ్యాల నిల్వలు, అమ్మకాలు చేయరాదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు రమేష్ నాయక్, శ్రీనివాసులు పాల్గొన్నారు.