- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ విద్యార్థుల చావులకు కారణం టీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. వైఎస్సార్‌టీపీ
దిశ, చిలిప్ చెడ్: రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం 12 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైందని వైయస్సార్‌టీపీ నాయకులు టి. నరేష్ ఆరోపించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నరేష్ డిమాండ్ చేశారు. చిలిప్ చెడ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ మాట్లాడుతూ.. కొవిడ్ ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని మొదటి సంవత్సరం విద్యార్థులందరిని మినిమమ్ పాస్ మార్కులతో ప్రమోట్ చేయాలని నరేష్ కోరారు. ఫెయిల్ అయిన వారిలో చాలా మంది విద్యార్థులు పేద, ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులే ఉన్నారని ఆరోపించారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరిని ప్రమోట్ చేయాలని పేర్కొన్నారు. లేదంటే వైయస్సార్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్తిక్, మధు, రమేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- inter students