- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మీరు వార్డుల్లో సారథులు.. ప్రజలకు, నాకు వారధులు'
దిశ, సిద్దిపేట: నేటి నుండి మీ వార్డు ప్రజలకు మీరు తల్లిదండ్రులు లాంటి వారని, ప్రజల అవసరాలు తెలుసుకొని వాటిని అమలు చేయడంలో ముందుండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నూతనంగా టి ఆర్ ఎస్ ఎన్నికైన కౌన్సిలర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సారి 36 మంది కొత్తగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారని, అందులో సగం మంది యువకులే ఉన్నారు. యువకులు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని, వార్డులో ప్రజలకు అవసమయ్యే కొత్త ప్రయత్నాలు చేయలన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి మీ కార్యాచరణ ప్రారంభం అవుతుందని, ఉదయం నల్ల దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజలకు సంబంధించిన ప్రతి దానికి భాద్యులు మీరే, వాళ్ళు మనకు చెప్పాలనే కాకుండా ప్రజల వద్దకు వెళ్లి వల్ల అవసరాలు తెలుసుకొని, వాటిని తీర్చడంలోనే నిజమైన నాయకత్వ లక్షణం అనిపించుకుంటుందన్నారు.
మీ మీ వార్డుల్లో దాదాపు అందరితో కలివిడిగా ఉంటూ వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తే ప్రజలు నాయకులను ఆదరిస్తారన్నారు. అలాగే మీ వార్డుల్లో మీ మీద పోటీ చేసిన వారిని కూడా ఆదరిస్తే, వారు కూడా మీ మిత్రులు అవుతారని, శత్రుత్వం కన్నా మిత్రుత్వంతో మనకు వార్డుకు మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, టి ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.