- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని 18వ వార్డు లింగోజిగూడకు జరుగుతున్న ఆకస్మిక ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఆయన కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రచారం నిర్వహించే రోజుల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎలాంటి ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలు, లోకల్ మీటింగ్ లు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. ప్రతి వార్డుకు హెల్త్ నోడల్ అధికారిని నియమించాలని, ఆ అధికారి నిబంధనలు అమలయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల తనిఖీ, బ్యాలెట్ పేపర్ణ ముద్రణ, ఎన్నికల సామగ్రి ముందుగానే సమకూర్చుకోవాలని ఎస్ఈసీ పార్థసారథి సూచించారు.
ఫేస్ మాస్క్.. చేతి గ్లౌసులు
పోలింగ్ సిబ్బందికి మాస్కులు, చేతి గ్లౌసులతో పాటు శానిటైజర్లు, ఫేస్ షీల్డ్ అందించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్, ఫర్నీచర్ ను ముందురోజే శానిటైజ్ చేసేలా చూడాలన్నారు. ఓటర్లు క్యూ లైన్ పాటించేలా మార్కింగ్ చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ అధికారుల సమన్వయంతో పక్కా బందోబస్తు ప్లాన్ రూపొందించాలని, కోడ్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద కనీసం నలుగురు పోలీసులు ఉండేలా చర్యలు చేపట్టాలని పార్థసారథి అధికారులను ఆదేశించారు. విశాలమైన కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేయాలని, ఐదు టేబుళ్లకు మించకుండా టేబుళ్లు ఏర్పాటు చేయాలని ఆయన
ఆదేశించారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్, జాయింట్ కమిషనర్ పంకజ్, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి అశోక్ కమార్, ఓఎస్డీ జయసింహా రెడ్డి పాల్గొన్నారు.