- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నెలాఖరులోపే ఏపీలో స్థానిక సమరం?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌తో మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై వీరు చర్చించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈనెల 21న, మున్సిపాలీటీలకు ఈనెల 24న, గ్రామ పంచాయతీలకు 27న వేర్వేరు తేదీల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను అధికారుల బృందం ఎన్నికల కమిషనర్ ముందుంచింది.
రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు మార్చి నెలాఖరులోగా రావాలంటే … ఈలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని ఎస్‌ఈసీ దృష్టికి తెచ్చారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసు బందోబస్తు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం తరఫున లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. ఈ సాయంత్రం లేదా రేపు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి వివరాలు అందజేస్తామని ఉన్నతాధికారుల బృందం కమిషనర్‌కు తెలిపింది.
tag; local body elections, ap, state election commissioner