ఆ వార్తల్లో వాస్తవం లేదు: ఎస్ఈసీ

by Shyam |
ఆ వార్తల్లో వాస్తవం లేదు: ఎస్ఈసీ
X

దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో 17 ఏండ్ల బాలుడికి ఎన్నికల విధులు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదనీ..అవన్నీ పుకార్లే అని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కేవలం వెబ్ క్యాస్టింగ్ కోసమే బాలుడిని పోలింగ్ కేంద్రంలో నియమించినట్టు తెలిపింది. వెబ్ క్యాస్టింగ్‌కు వయసుతో పనిలేదనీ, కంప్యూటర్ పరిజ్ఞానం ముఖ్యమని వివరణ ఇచ్చింది. భోజనం చేయడానికి ఇతర సిబ్బందితో కలిసి బాలుడు కుర్చీలో కూర్చున్నాడని చెప్పింది. ఆ బాలుడికి ఎన్నికల విధులు కేటాయించామనడంలో వాస్తవం లేదని ఎస్ఈసీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed