- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ డబుల్ గేమ్‌ను తిప్పికొట్టాలి
దిశ, తెలంగాణ బ్యూరో :
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల పక్షాన పోరాడాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కొత్త ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ దిశా నిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ ఆడుతున్న డబుల్ గేమ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. గతంలో కేంద్ర ప్ఱభుత్వం తీసుకొచ్చిన అనేక బిల్లులకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం వ్యవసాయ బిల్లులకు వ్యతిరేక వైఖరి తీసుకున్నారని గుర్తుచేశారు. ఒకవైపు కేంద్ర వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తూనే మరోవైపు వాటికి వ్యతిరేకంగా రైతుల్నీ వీధుల్లోకి తీసుకురావడానికి బదులుగా అనుకూల ర్యాలీలు చేయించుకుంటున్నారని, చాలా తెలివిగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
నిరంతరం ప్రజల మధ్యనే ఉండాలని కాంగ్రెస్ లీడర్లకు, కేడర్‌కు మాణిక్యం స్పష్టంచేశారు. పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ ఐక్యంగా పనిచేస్తూ సమిష్టి పనివిధానం ద్వారానే పార్టీ బలపడుతుందని, ఇందుకోసం గ్రామస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని నొక్కిచెప్పారు. ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయనకు రాష్ట్ర పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వారితో గాంధీభవన్‌లో సమావేశమైన సందర్భంగా నెల రోజుల కార్యాచరణను ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నెల రోజుల క్యాంపెయిన్‌లో భాగంగా ఈ నెల 28న గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేయాలని, అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా కిసాన్-మజ్దూర్ బచావో దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతుల్నీ సమీకరించాలని సూచించారు. ఆ మరుసటి రోజు నుంచి నెల చివరి వరకూ అన్ని గ్రామాల్లో క్యాంపెయిన్ చేపట్టి వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది రైతుల సంతకాల సేకరణంలో భాగంగా తెలంగాణలోనూ భారీ సంఖ్యలో సంతకాలను సేకరించాలని సూచించారు.