మ్యూచువల్ ఫండ్స్‌పై స్టాంప్ డ్యూటీ!

by Harish |
మ్యూచువల్ ఫండ్స్‌పై స్టాంప్ డ్యూటీ!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ అమల్లోకి రానుంది. గతంలోనే ఈ ప్రతిపాదన రెండుసార్లు వాయిదా పడింది. తొలిసారి జనవరిలో అమలు చేయాల్సి ఉండగా, దాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు. తర్వాత దీన్ని జూలైకు మార్చడం జరిగింది. సిస్టమేటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్, డెట్, ఈక్విటీ లాంటి వాటిపైన ఈ నిబంధనలను అమల్లోకి వస్తాయి. ప్రధానంగా డెట్ ఫండ్స్‌పైన దీని ప్రభావం అధికంగా ఉండనుంది. డీ మాట్ అకౌంట్ల బదలాయింపులపై 0.015 శాతం, కొనుగోలు, స్విచ్ ఇన్ అమౌంట్‌పై 0.005 శాతం అమలు కానుంది. 90 రోజుల కంటే తక్కువ సమయం ఉంచుకునే మ్యూచువల్ ఫండ్స్‌పై ఈ స్టాంప్ డ్యూటీ ప్రభావం ఉంటుంది. కాగా, డివిడెండ్ రీఇన్వెస్ట్‌మెంట్‌లో డివిడెండ్ నుంచి టీడీఎస్‌ను తొలగించిన తర్వాత మిగిలిన మొత్తం పన్ను ఉంటుంది. కొనుగోలులో ఛార్జీలు పోనూ మిగిలిన మొత్తంపై పన్ను విధించనున్నారు.

Advertisement

Next Story