భారీ వర్షంలో స్టాఫ్ నర్స్ రిస్క్.. వరదలను లెక్కచేయకుండా..!

by Aamani |   ( Updated:2021-07-14 07:59:00.0  )
భారీ వర్షంలో స్టాఫ్ నర్స్ రిస్క్.. వరదలను లెక్కచేయకుండా..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు విధులు నిర్వహించుటకు సరైన రోడ్డు లేదు. కనీసం గ్రామానికి వెళ్లడానికి ప్రయాణ వసతులు కూడా లేవు. కానీ, ఆ స్టాఫ్ నర్స్ భారీ వర్షంలో టీకాలు వేసేందుకు కాలి నడకన చేసిన సాహసానికి నెటిజన్‌లు ఫిదా అయ్యారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో మంగళవారం రాత్రి 69.6 మిల్లీ మీటర్ల భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎత్తోండ సబ్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ సరోజా టీకాలు వేసేందుకు భుజాన ఇమ్యూనైజేషన్ బ్యాగ్, మరో చేతిలో రిజిస్టర్‌కు సంబంధించిన ఫైళ్లతో బయల్దేరింది. భారీ వరదల నడుమ, మోకాళ్లలోతు నీళ్లలో నుంచి నడుస్తూ.. విధులకు హాజరై టీకాలు వేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, ఈ ఫొటో కాస్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. సాహో సరోజా అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed