యువకుడికి కత్తిపోట్లు

by Shyam |   ( Updated:2020-08-15 07:17:20.0  )
యువకుడికి కత్తిపోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: యువతితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడనే నెపంతో అతడిపై హత్యాయత్నం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. కేపీహెచ్‌బీలోని సాయి నగర్ కు చెందిన సమీర్ ను సోహిల్, ఆసిఫ్, అస్లమ్ తమ ఆటోలోకి ఎక్కించుకోని కత్తులతో పొడిచారు. సమీర్ గట్టిగా అరవడంతో ఓ వ్యక్తి ఆటో దగ్గరకు వచ్చాడు. అతడిని గమనించిన దుండగులు సమీర్ ను ఆటోలోని కిందికి తోసేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కత్తిపోట్లకు గురైన సమీర్ ను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story