ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా : రాజమౌళి

by Shyam |
ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా : రాజమౌళి
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ 19 ఎఫెక్ట్‌తో ప్రపంచం స్తంభించిపోవడం చూస్తే షాకింగ్‌గా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భయాందోళనలు వ్యాప్తి చెందకుండా ఉండటం అత్యవసరం అన్నారు. కోవిడ్ 19 సంక్రమణ వ్యాప్తిని నివారించేందుకు ప్రామాణిక సిఫార్సులను అనుసరించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో సూచించారు. కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పోస్ట్‌ను షేర్ చేసిన జక్కన్న… కోవిడ్ 19తో ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story