ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా టెన్త్ ఫలితాలు..

by Shyam |
ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా టెన్త్ ఫలితాలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఆధారంగా టెన్త్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. రెండు మూడు రోజుల్లోనే టెన్త్ విద్యార్థులకు గ్రేడ్ల ప్రకారం ఫలితాలను తెలియజేయనున్నారు. టెన్త్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్న 5,21,398 మంది విద్యార్థుల్లో 2లక్షల మంది 10/10 జీపీఏతో ఉత్తీర్ణులు కానున్నారు.

కరోనా కారణంగా వరుసగా రెండో ఏడాది టెన్త్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్ఏ-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయిస్తున్నారు. మార్కుల మెమోలో హాల్‌టికెట్‌ నంబర్‌ను కూడా నమోదు చేయనున్నారు. గతేడాది నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల సగటు ఆధారంగా టెన్త్‌ ఫలితాలు ప్రకటించగా ఈసారి మాత్రం ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు కేటాయించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని ప్రభుత్వ భావిస్తున్నది..

Advertisement

Next Story