- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్త్ పరీక్షలు రద్దు.. ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా..!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే (సీబీఎస్ఈ) పదోతరగతి పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అకాడమిక్ ఇయర్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను, పేరెంట్స్ ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులను ఈనెల 30వరకు పొడగించడంతో పాటు పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 5 లక్షల 35 వేల మంది టెన్త్ విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ కానున్నారు. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలును సీఎం కేసీఆర్‌కు పంపించగా ఆయన సంతకం కూడా పెట్టినట్లు సమాచారం.కాగా, దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మరికాసేపట్లో వెలువడనున్నాయి.