మిస్‌ వైజాగ్‌-2021 విజేతగా సృజిత గాలి

by srinivas |
Vizag1
X

దిశ, ఉత్తరాంధ్ర: మిస్‌ వైజాగ్‌–2021 పోటీలు అదరహో అనిపించాయి. క్రియేటివ్‌ ప్లస్‌ ఆధ్వర్యంలో గత ఆదివారం మిస్‌ వైజాగ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న మోడల్స్ తమ క్యాట్ వ్యాక్‌లతో స్టేజ్‌పై అదరగొట్టారు. విశాఖలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన మోడళ్లు ర్యాంప్‌పై హొయలొలికించారు. తమ అందచందాలతో యువతకు మత్తెక్కించారు. స్టేజ్‌పై తమ ఒంపుసొంపులతో భామలు కనువిందు చేశారు. సాగరతీరంలోని ఓ హోటల్‌లో రాత్రి వేళ హాట్‌లుక్స్ తో మోడల్స్ కేకపెట్టించారు. మిస్ వైజాగ్-2021 పోటీలకు 21 మంది మోడల్స్ పోటీ పడ్డారు. అయితే వీరిలో మిస్‌ వైజాగ్‌గా కుమారి సృజిత గాలిని న్యాయ నిర్ణేతలు ప్రకటించారు. రన్నరప్‌గా కుమారి మస్కన్‌ నయ్యర్‌, మూడో స్థానంలో చరిష్మా కృష్ణ నిలిచారు.

వీరితో పాటు వివిధ విభాగాల్లో మరో 11 మందికి టైటిల్స్‌ అందజేశారు. మిస్‌ సోషల్‌ మీడియా క్వీన్‌గా పవిత్ర, మిస్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా ముస్కాన్‌ నయ్యర్, మిస్‌ ఫొటోజెనిక్‌గా నేహా జమేలు, మిస్‌ బ్యూటిఫుల్‌ హెయిర్‌గా సంధ్య, మిస్‌ గ్లోయింగ్‌ స్కిన్‌గా నేహా గుప్తా, మిస్‌ బ్యూటిఫుల్‌ ఐస్‌– పవిత్ర, మిస్‌ షైనింగ్‌ స్టార్‌– చరిష్మా, మిస్‌ గుడ్‌ నెస్‌ అంబాసిడర్‌– బోర్నిట, మిస్‌ ఫర్ఫెక్ట్‌ ర్యాంప్‌ వాక్‌– తారా, మిస్‌ గ్లామరస్‌ క్వీన్‌– రుచితారెడ్డికి టైటిల్స్‌ అందజేశారు.

Next Story

Most Viewed