- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. ముక్కోటి ఏకాదశి కావడంతో శుక్రవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చింది. లాక్‌డౌన్ తర్వాత హుండీ ఆదాయం ఈ స్థాయికి చేరడం ఇదే మొదటి సారి అని అధికారులు తెలిపారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4కోట్లకుపైగా రావడం ఈ నెలలో ఇదే తొలిసారి. కాగా ఇప్పటికే ఈ నెలలో హుండీ ఆదాయం నాలుగు సార్లు 3 కోట్లకు పైగా వచ్చింది. శ్రీ వారి దర్శనానికి సర్వ దర్శనం టోకెన్లను కూడా జారీ చేస్తున్నారు. దీంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మరో పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండటంతో హుండీ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Advertisement
Next Story