మరో వారం పాటు దర్శనాలుండవ్

దిశ, వెబ్ డెస్క్:
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరికొంత మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో శ్రీశైలం ఆలయంలో మరో వారం పాటు దర్శనాలకు అనుమతిలేదని ఆలయ అధికారులు ప్రకటించారు. గత నెల 15వ తేదీ నుంచి శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఆలయంలో దర్శనాలు నిలిచిపోయాయి. సరిగ్గా దర్శనాలకు అనుమతి ఇచ్చేలోపే సిబ్బందికి కరోనా సోకడం.. అదికాస్త మరింత ముందుకు వెళ్ళడం జరుగుతూనే ఉంది. కాగా, స్వామివారికి నిత్య కైంకర్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement