ఆ నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు.. ప్రభుత్వంపై పవన్ ఆగ్రహం

by srinivas |   ( Updated:2024-04-26 14:25:17.0  )
ఆ నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారు.. ప్రభుత్వంపై పవన్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల సీఎం జగన్ పై గులకాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు వేముల సతీశ్‌ను అరెస్ట్ చేసి జైలు‌కు పంపారు. అయితే అందర్వేది రథాన్ని కాల్చివేసిన నిందితులను ఇప్పటి వరకూ పట్టుకోలేకపోయారు. దీంతో ప్రభుత్వం, సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన డైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనపై మండిపడ్డారు. ఈ కేసు నిందతుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్ చిన్న గులకరాయి పడితేనే యువకుడిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. అంతమందిలో కూడా నిందితుడిని గుర్తించిన తమరు.. అంతర్వేదిలో రథాన్ని కాల్చివేస్తే ఎందుకు పట్టుకోలేకపోయారని నిలదీశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో పవన్ కల్యాన్ ఎన్నికల ప్రచారం సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు. రైతులకు నీరు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమస్యలు పరిష్కరిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో తాను రూ. 70 కోట్లు ట్యాక్స్ కట్టానని చెప్పారు. రాపాక వర ప్రసాద్ ఐదు ఎకరాల్లో భారీగా ఇల్లు కట్టుకున్నారని, రైతుల కష్టాలను ఆయన ఎందుకు తీర్చలేకపోయారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Read More...

రాష్ట్రంలో 30 వేల మంది ఆడపిల్లల మిస్సింగ్.. పవన్ ఆగ్రహం

Advertisement

Next Story