కేసీఆర్ బస్సులో ‘లిఫ్ట్’.. గులాబీ బాస్ ఎంట్రీ మామూలుగా లేదుగా!

by Ramesh N |   ( Updated:2024-04-27 14:47:30.0  )
కేసీఆర్ బస్సులో ‘లిఫ్ట్’.. గులాబీ బాస్ ఎంట్రీ మామూలుగా లేదుగా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. 17 రోజులు, 22 రోడ్ షోలతో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచార వాహనం అయిన బస్సు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌కు బస్సు గిఫ్ట్‌గా ఇచ్చారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో బస్సుకు నామకరణం చేశారు. ఈ ప్రచార రథం కొత్త టెక్నాలజీతో అప్డేట్‌లో ఉంది. ఆ బస్సులో లిఫ్ట్ ఏర్పాటు చేశారు.

రోడ్డు షోలు ఇస్తున్న సమయంలో కేసీఆర్ ఆ లిఫ్ట్ బటన్ నొక్కి బస్సు పైకి వేరే లెవల్లో ఎంట్రీ ఇస్తున్నారు. తర్వాత ఆ లిఫ్ట్ బస్సులోకి వెళ్లిపోతుంది. తర్వాత గులాబీ బాస్ ప్రసంగం స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కరెంటు కోతలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, హామీల అమలులో జాప్యమే ప్రధాన ఎజెండాగా గులాబీ బాస్.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ దూసుకెళ్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed