- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ ఆతిథ్యానికి శ్రీలంక రెడీ
దిశ, స్పోర్ట్స్: అర్దాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లోని మిగిలిన 31 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం సిద్దంగా ఉన్నామని శ్రీలంక క్రికెట్ తెలిపింది. ఐపీఎల్ సీజన్‌ను ఎలాగైనా ముగించాలని బీసీసీఐ చూస్తున్నట్లు మాకు సమాచారం అందింది. గత సీజన్‌లో వేదికైన యూఏఈతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ నిర్వహించేందుకు మేము ఆహ్వానం పలుకుతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు సలహాదారు అర్జున్ డి సిల్వ పేర్కొన్నారు.
జులై-అగస్టు నెలల్లో లంక ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తామని.. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్ ఆతిథ్యానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తమ వద్ద అంతర్జాతీయ మైదానాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, గత సీజన్‌లో ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చినందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ దాదాపు రూ. 100 కోట్లు చెల్లించింది.