- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి షాక్.. శ్రీకాంత్ రెడ్డి రాజీనామా
దిశ ప్రతినిధి, నల్లగొండ: వైసీపీకి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌లో జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, జాతీయ పార్టీ నుంచి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిలకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పారు. తెలంగాణపై వైసీపీ దృష్టి పెట్టకపోవడం, షర్మిల కొత్త పార్టీ పెట్టిన క్రమంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2007 నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో తనకు పరిచయం ఉందని, అప్పటినుంచి జగన్‌తో కలిసి నడిచానని గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జగన్‌పై ఉన్న నమ్మకంతో ఆయన వెంట ఉండిపోయానని, అందుకే తనను తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా నియమించారన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు నడుచుకున్నానన్నారు. ఏపీలో జగన్‌ను ప్రజలు నమ్మారని, అందుకే 151 ఎమ్మెల్యే స్థానాలు, 23 ఎంపీలు ఇచ్చారన్నారు.
కానీ తెలంగాణపై వైసీపీ దృష్టి సారించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడు సంవత్సరాలైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయమని, నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్టకు తప్ప మరే ఒక్క నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదన్నారు. వాడపల్లి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని, సాగర్‌లో డబ్బే గెలుస్తుందన్నారు. డబ్బు కావాలా? అభివృద్ధి కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.