- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్తనశాలలో ‘భీముడు’.. శ్రీహరి పాత్రపై కొడుకు ఆనందం
దిశ, వెబ్‌డెస్క్ : నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహించిన పౌరాణిక ఇతిహాసం ‘నర్తనశాల’. తండ్రి నందమూరి తారకరామారావు నటించిన ‘నర్తనశాల’ సినిమాను రీమేక్ చేయడం తన కల కాగా.. కొన్నేళ్ల కిందట అదే పేరుతో సినిమా చిత్రీకరణ ప్రారంభించారు బాలయ్య. కానీ దురదృష్టవశాత్తు ఇందులో ద్రౌపదిగా నటించిన సౌందర్య మరణంతో సినిమా అలాగే అసంపూర్తిగా మిగిలిపోయింది. కేవలం 17 నిమిషాల నిడివితో సినిమా చిత్రీకరణ జరగగా.. అదే సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బాలయ్య.
ఈ క్రమంలో నర్తనశాల నుంచి అర్జునుడిగా బాలయ్య లుక్ మంగళవారం విడుదల కాగా, బహు బాగుందనే ప్రశంసలు అందుకుంది. కాగా బుధవారం భీముడిగా శ్రీహరి లుక్ రిలీజ్ చేశారు. దీంతో అభిమానులతో పాటు శ్రీహరి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీహరి కొడుకు మేఘాంశ్ మాట్లాడుతూ.. నాన్నగారిని మళ్లీ ఇన్ని రోజుల తర్వాత తెరపై చూసుకునే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ అదృష్టం కలిగిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. మాతో పాటు ప్రేక్షకలోకం మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోందని అన్నారు.
కాగా, శ్రేయాస్ ఈటీలో ఎన్‌బీకే థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న సినిమా కోసం బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.. కేవలం రూ. 50 చెల్లించి సినిమా చూడొచ్చని తెలిపారు బాలకృష్ణ.
Here it is, RealStar #SriHari's look as Bheema in #Narthanasala directed and acted by #NandamuriBalakrishna
Releasing this 24th on #WorldsFirstATT @ShreyasET
Book your ticket here : https://t.co/OCxThil0Ic#NarthanasalaOnShreyasET pic.twitter.com/ZbDfjLvqBp
— NBK FILMS (@NBKFilms_) October 21, 2020
Here's how to watch #NBK's mythological epic #Narthanasala
Book your ticket and be a part in Great Cause, A charity initiative by #NandamuriBalakrishna
Book your ticket here : https://t.co/OCxThil0Ic@NBKFilms_ @shreyaset#NarthanasalaOnShreyasET pic.twitter.com/debxPx4rDc
— NBK FILMS (@NBKFilms_) October 21, 2020