విరహ వేదనను అనుభవిస్తున్న శ్రీరెడ్డి.. ఆర్జీవీకి ప్రేమ లేఖ

by Jakkula Samataha |
విరహ వేదనను అనుభవిస్తున్న శ్రీరెడ్డి.. ఆర్జీవీకి ప్రేమ లేఖ
X

దిశ, సినిమా: సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మకు వివాదాస్పద నటి శ్రీరెడ్డి విరహ వేదనతో రాసిన ప్రేమ లేఖను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. వర్మకు నా విరహ వేదన లేఖ అంటూ మొదలుపెట్టిన శ్రీరెడ్డి.. ‘నా కల కల్లోలమా, నా వయసు వయ్యారమా, నా యద బంగారమా, నా ధైర్య దిగ్గజమా, నా గురు గోవిందుడా , నా వోడ్కా వజ్రమా, నా పుష్ప పుణ్యమా’ అని తనదైన స్టైల్‌లో వర్మను పొగిడేస్తూ ఆర్జీవీపై తనకున్న ప్రేమను కవితాత్మకంగా వర్ణించింది.

https://twitter.com/MsSriReddy/status/1371350057631444997?s=20

ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. బాబోయ్! ఇదెప్పటి నుంచి అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికిద్దరూ చక్కగా సరిపోతారు.. విరహ వేదనతో సమయం వృథా చేసే కన్నా, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోండి! అని సూచిస్తున్నారు. అయినా శ్రీరెడ్డికి ఫేమస్ ఎలా అవ్వాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో తెలిసిపోయిందంటున్న నెటిజన్లు.. ఈ విరహ వేదన లేఖ చూశాక వర్మ నీకు తప్పకుండా చాన్స్ ఇస్తాడులే అని చెప్తున్నారు.

Advertisement

Next Story