బయోబబుల్‌లోకి శ్రీలంక ఆటగాళ్లు

by Shyam |
Srilanka-Cricketers
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక క్రికెటర్లకు తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్ట్ నిరోషన్ కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో శ్రీలంక ఆటగాళ్లను క్వారంటైన్ చేశారు. మూడు రోజులు గడవటంతో వారికి తిరిగి పరీక్షలు నిర్వహించగా అందరూ నెగెటివ్‌గా తేలారు. దీంలో వీరిని సోమవారం నుంచి బయోబబుల్‌లోకి పంపనున్నట్లు శ్రీలంక క్రికెట్ తెలిపింది.

దీంతో మార్చిన షెడ్యూల్ ప్రకారం ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఉన్న అడ్డంకి తొలిగినట్లే అని ఒక అధికారి అన్నారు. బయోబబుల్‌లో ఉన్న సమయంలో కూడా ఆటగాళ్లందరికి ప్రతీ మూడు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇక గ్రాంట్ ఫ్లవర్, నిరోషన్ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారని.. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని శ్రీలంక క్రికెట్ అధికారి వెల్లడించారు. ఇండియా-శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జులై 18 నుంచి ప్రారంభం కానున్నది.

Advertisement

Next Story