అరవింద డిసిల్వా.. 6గంటల విచారణ

by Shyam |
అరవింద డిసిల్వా.. 6గంటల విచారణ
X

దిశ, స్పోర్ట్స్: 2011లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ ఫిక్స్ అయ్యిందని, ఆ కప్‌ను ఇండియాకు శ్రీలంక అమ్మేసుకుందని ఆ దేశ క్రీడాశాఖ మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహించిన శ్రీలంక ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే మహీందానందను విచారించింది. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ అరవింద డిసిల్వాను విచారణ చేసింది. 2011 ప్రపంచ కప్‌కు శ్రీలంక జట్టును ఎంపిక చేసిన కమిటీకి డిసిల్వా చైర్మన్‌గా వ్యవహరించారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన్ని 6గంటలపాటు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ప్రపంచ కప్ ఫైనల్స్‌పై బీసీసీఐ విచారణ జరపాలని, అవసరమైతే స్వతంత్ర కమిటీ విచారణ కోసం ఇండియకు సైతం వస్తానని చెప్పాడు. కాగా, శ్రీలంక పోలీసులు చేసిన విచారణలో ఏం చెప్పాడు బహిర్గత పర్చలేదు. తర్వాత మాజీ ఆటగాడు ఉపుల్ తరంగను విచారిస్తామని దర్యాప్తు బృందం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed