- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ కప్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు నిలిపివేత
దిశ, స్పోర్ట్స్: 2011 ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో శ్రీలంక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేనందున దర్యాప్తును నిలిపివేస్తున్నామని శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శ్రీలంక మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, అరవింద డిసిల్వాలను గంటల సేపు విచారించిన దర్యాప్తు బృందానికి ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో శుక్రవారం ఈ కేసు విచారణ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. క్రీడా మంత్రిత్వ శాఖ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు మాజీ శ్రీలంక ఫస్ట్ క్లాస్ క్రికెటర్, అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాత రోషన్ అబీసింగే కూడా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘సరైన ఆధారాలు లేనందున శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తును నిలిపివేసింది’ అని రాసుకొచ్చారు. 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వ్యవహారం ప్రస్తుతం శ్రీలంకలో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. కాగా, భారత్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయిందని ఆ దేశ మాజీ క్రీడాశాఖ మంత్రి అలుత్గమాగే మహిందానంద చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న లంక ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.