నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించేనా పంచాయితీ!

by Shyam |
నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించేనా పంచాయితీ!
X

దిశ, సినిమా : ‘రాజావారు రాణిగారు’ హీరో కిరణ్ అబ్బవరం మరో హిట్ ఖాతాలో వేసుకోనున్నాడు అంటున్నారు నెటిజన్లు. ప్రియాంక జవాల్కర్‌ జోడీగా తెరకెక్కిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. రెండు నిమిషాల టీజర్‌ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించడంతో పాటు కిరణ్ అబ్బవరంలోని యాక్షన్ యాంగిల్ కూడా పరిచయం చేశాడు డైరెక్టర్ శ్రీధర్ గాదె. ‘ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించేనా పంచాయితీ’ అనే హీరో డైలాగ్‌తో మొదలైన టీజర్.. ప్రియాంక జవాల్కర్‌తో లవ్ ట్రాక్.. బ్యాక్ బెంచ్ ఫ్రెండ్స్‌తో చాటింగ్.. ఆ తర్వాత తండ్రితో కలిసి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏర్పాటు చేసి పెళ్లిళ్లు చేయాలనుకోవడం.. ఈ క్రమంలో ఫన్నీ సీన్స్ ఎలివేట్ కావడం సినిమాకు ప్లస్ కానుంది.

హీరో కిరణ్ అబ్బవరం ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా.. ఒక్కో డైలాగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి ఈ చిత్రం ద్వారా సమ్మర్‌లో ఎంటర్‌టైన్మెంట్ పక్కా అని తెలుస్తుండగా.. ముఖ్యంగా సాయి కుమార్ కామెడీని ఆడియన్స్ బాగా ఆస్వాదిస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ సూపర్బ్ ఉందంటున్న యూత్.. సాయి కుమార్ క్యారెక్టర్‌కు కూడా అంతే ఇంప్రెస్ అవుతున్నారు. వెరైటీ కంటెంట్‌తో వస్తున్న ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story